Prabhas | ప్రతి పాత్రను ఓ సవాలుగా స్వీకరించి అభిమానులను అలరించడమే తన లక్ష్యమంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటూ కథలను ఎంపిక చేసుకుంటానని చెప్పారాయన. ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ భారీ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో స్వీక్వెల్ రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ‘సలార్’ విజయవంతమైన సందర్భంగా ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ‘సలార్’ సీక్వెల్, తదుపరి ప్రాజెక్టుల విశేషాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
“సలార్-2’ స్క్రిప్టు పూర్తయ్యింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ సీక్వెల్ కోసం నా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు అప్డేట్స్ ఇస్తాం. నాకు విభిన్న నేపథ్య కథల్లో నటించాలని ఉంది. ప్రేక్షకుల నుంచి ‘సలార్’కు వచ్చిన స్పందనే నా తర్వాతి సినిమాలకూ వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం హారర్, సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో నటిస్తున్నా” అని చెప్పారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’లో యాక్షన్ సీక్వెన్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాయి.