Prabhas | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్వకత్వంలో ‘ప్రాజెక్ట్-K’ సినిమాల షూటింగ్లలో ఏకకాలంలో పాల్గొంటున్నాడు. అయితే ప్రభాస్ మోకాలు సర్జరీ కారణంగా కొన్ని రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. తాజాగా ఈయన ప్రాజెక్ట్-K షూట్లో జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ పూర్తవ్వగానే ప్రభాస్ ‘సలార్’ బిగ్ షెడ్యూల్లో పాల్గొననున్నాడు.
ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరపుకుంటుంది. మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. ఇక మారుతితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.