‘కల్కి 2898ఏడీ’ చిత్రాన్ని ఓ విధంగా భారతీయ వెండితెర సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్రాంచైజీల్లో తొలిభాగం వెయ్యికోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టడం ‘కల్కి 2898ఏడీ’ విషయంలోనే జరిగింది. ప్రస్తుతం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయితే తప్ప ఆయన తర్వాత సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకే.. ‘కల్కి’ బృందం షెడ్యూల్స్‌లో మార్పులు చేశారని వినికిడి. కథానుగుణంగా ఈ రెండో భాగంలో కమల్‌హాసన్ పాత్ర చాలా కీలకం.
ఆయన పోషించే సుప్రీం యాస్కిన్ పాత్రకి సంబంధించిన సీన్స్ సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా ఉంటాయట. అందుకే దర్శకుడు నాగ్అశ్విన్ ‘కల్కి 2’ షూటింగ్‌ను కమల్‌హాసన్ పాత్రతో మొదలుపెట్టబోతున్నారట. దీనికోసం కమల్‌హాసన్ నుంచి బల్క్ డేట్స్ కూడా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్తుందని తెలిసింది. ఇందులో సుప్రీం యాస్కిన్‌గా కమల్ విశ్వరూపం చూస్తారని చిత్రబృందం చెబుతున్నది. ప్రభాస్ మినహా, మిగతా వారందరితో కమల్ కాంబినేషన్ సీన్స్ తీస్తారట. ఆల్రెడీ సీజీ వర్క్ మొదలైందట. షెడ్యూల్ ప్రకారం సినిమా టాకీ పూర్తయితే.. 2027 చివర్లో విడుదల ఉంటుందని సమాచారం.