Prabhas Instagram Record | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఇటీవలే టిక్కెట్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. సేల్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి సినిమాపైన అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా మరో అరుదైన ఫీట్‌ను సాధించాడు.
ప్రభాస్‌కు ఇప్పుడు ప్రపంచమంతటా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 8 మిలియన్లకు చేరుకుంది. అతి తక్కువ సమయంలో ప్రభాస్ ఈ ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ను అభిమాలతో పంచుకుంటాడు. ఇక ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ స్క్రిప్ట్ దశలో ఉంది. వీటితో పాటుగా మారుతి దర్శకత్వంలో కామెడీ హర్రర్ సినిమాను చేయబోతున్నట్లు తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కన్ఫార్మ్ చేశారు.