Prabhas – Rana | తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి, అద్భుత విజయాన్ని సాధించడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి: ది బిగినింగ్ (Part 1) రిలీజ్ అయ్యి దాదాపు పదేళ్లు కావడంతో, మూవీ యూనిట్ ఇటీవలే రీ-యూనియన్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది. అదే సమయంలో, బాహుబలి రెండు భాగాల్ని కలిపి ఒకే సినిమా రూపంలో మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. రీ-రిలీజ్ అక్టోబర్ 31న జరగనుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో “కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేది?” అనే ప్రశ్నను ఓ నెటిజన్ అడగగా, రానా సరదాగా స్పందిస్తూ.. “నేనే చంపేవాడ్ని!” అంటూ కామెంట్ చేశాడు. రానా పెట్టిన ఆ పోస్ట్‌కి ప్రభాస్ స్పందిస్తూ.. దీని కోసం నేనే అలా జరగనిచ్చాను అంటూ బాహుబలి 2 మూవీ వెయ్యి కోట్ల క్లబ్‌కి చేరిన పోస్టర్‌ను షేర్ చేశాడు. అంటే కట్టప్ప చేత బాహుబలిని చంపించడం వల్లే రెండో భాగం అంతటి సంచలన విజయం సాధించిందని, అది స్క్రిప్ట్ లో భాగమే అని సరదాగా తెలియజేశాడు.
ఈ సోషల్ మీడియా ఇంటరాక్షన్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొత్తంగా చూస్తే, బాహుబలి రీ-రిలీజ్‌ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ, మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు యూనిట్ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం పై స్పందించిన రానా.. బాహుబలి ఎంత రన్‌టైం ఉన్న నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేస్తాను. నాకు కూడా రన్‌టైం గురించి కరెక్ట్‌గా తెలియదు. నేను కూడా సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తున్నాను. కొందరూ ఏమో నాలుగు గంటలంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకొచ్చాడు.
Pra 1