Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ తర్వాత ఆయన ఫోకస్‌ను కల్కి 2, స్పిరిట్, అలాగే ఫౌజీ వంటి భారీ సినిమాలపై పెట్టారు. ఒకేసారి మూడు ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్న ప్రభాస్ షెడ్యూల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో సాగే సోల్జర్ స్టోరీగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇన్ఫ్లూయెన్సర్ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్గా పరిచయం అవుతోంది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘బలగం’ ఫేమ్ మైమ్ మధు వెల్లడించారు.
ఓ మీడియా పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన .. ఫౌజీ సినిమాలో నేను నటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది. సెట్స్‌లోకి వెళ్లిన ప్రతిసారి కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. అయితే షూటింగ్ సమయంలో మాకు 30 కేజీల గొలుసులు వేసి యాక్ట్ చేయిస్తున్నారు అని చెప్పారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో రియలిస్టిక్ ఫీల్ కోసం దర్శకుడు ఈ స్థాయి కష్టాన్ని నటీనటుల నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు కూడా పెద్ద పీట వేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ హను రాఘవపూడి విజన్, సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా నిలబెడతాయని చిత్రబృందం చెబుతోంది. ‘ఫౌజీ’లో పలువురు సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్, రాహుల్ రవీంద్రన్, ప్రవీణ్ దాచారం, చైత్ర జె. ఆచర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ మధ్యలో వచ్చిన చిన్న బ్రేక్‌ను వినియోగించుకుని ప్రభాస్ ఇటలీకి వెకేషన్‌కు వెళ్లి తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. , ఫౌజీ సినిమా కోసం నటీనటులు పడుతున్న కష్టాలు, దర్శకుడి విజన్ చూస్తుంటే ఈ చిత్రం నిజంగానే భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.