Deepika Padukone | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికాపదుకొణె (Deepika Padukone), రానా దగ్గుబాటి ఇతర నటీనటులు వచ్చి సందడి చేశారు. అయితే ఈవెంట్లో భాగంగా దీపికా ప్రభాస్ మీదా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో దీపిక మాట్లాడుతూ.. ప్రభాస్ నార్మల్‌గా రెండు మాటలు మాట్లాడాడు అంటే మనం సంబరాలు చేసుకోవాలి. ఇంట్రోవర్ట్ (బహిరంగంగా మాట్లాడలేని వారు)గా ఉండే ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప అంటూ సరదాగా అన్నారు. దీనికి ప్రభాస్ మాట్లాడుతూ.. దీపిక గొప్పనటి, సూపర్‌స్టార్ అని ప్రశంసలు కురిపించారు. అయితే దీపిక తన బేబీ బంప్‌ను చూపిస్తూ.. ప్రభాస్ ఫుడ్ వలనే నేను ఇలా అయ్యాను అంటూ తెలిపింది. ప్రభాస్ అందరికి ఫుడ్ ట్రీట్ ఇస్తాడని ఇంతకుముందు చాలాసార్లు విన్నాను. కానీ కల్కి షూటింగ్లో ప్రభాస్ దగ్గరుండి తినిపించిన తిండి వల్లే ఇలా అయ్యాను అంటూ దీపిక చెప్పుకోచ్చింది. కాగా దీపిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
From What is #Prabhas feeding everyone to , for those who know him well knows that Prabhas feeds from the heart – @deepikapadukone about #Prabhas 🥹❤️ #KALKI2898AD pic.twitter.com/l1av2ukvbP
— Prabhas Trends (@TrendsPrabhas) June 19, 2024