ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలకంటే ఇంకా సెట్స్‌మీదకు వెళ్లని ‘స్పిరిట్’ గురించే ఆయన అభిమానుల్లో ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందుక్కారణం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘యానిమల్’ సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 900కోట్లతో సంచలన విజయాన్ని సాధించింది. ఇలాంటి పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాబట్టి ‘స్పిరిట్’ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవుతున్నది.
ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్ర చేయడం కూడా ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులో ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్స్ యాక్షన్ కలబోసిన కాప్ స్టోరీ ఇదని, ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరిస్తుందని అంటున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు.