Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ‘సలార్’ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్పై ప్రశంసల జల్లు కురిపించారు. హోంబలే ఫిల్మ్స్‌తో పని చేయడానికి గల అసలు కారణాన్ని కూడా వెల్లడించారు. విజయ్ తన టీమ్‌తో వ్యవహరించే తీరు, వినమ్రత, మరియు స్నేహపూర్వక స్వభావమే తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. విజయ్ తన చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ దగ్గరగా ఉంటారు. ఎంత ఎదిగినా అదే వినయం కొనసాగిస్తున్నారు. అదే లక్షణం నాతోనూ కలిపింది అని ప్రభాస్ స్పష్టం చేశారు.
సలార్ సినిమాతో మొదలైన మా ప్రయాణం కుటుంబంలా అనిపించింది. హోంబలే టీమ్ ఎంతో కేర్ తీసుకుంటుంది. మనీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు. ఇది నా మనసుకు నచ్చిన విషయం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు. అలాగే, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా, తదుపరి ‘సలార్ 2’ మరియు ‘కల్కి 2’ సినిమాలు ప్లాన్‌లో ఉన్నాయి. ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్‌తో మరో రెండు సినిమాలు చేసే అవకాశం ఉందని, మొత్తం మూడు సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. రానున్న రోజులలో మరిన్ని చేస్తానని ఆయన అన్నారు.
`హాలీవుడ్ రిపోర్టర్`తో షార్ట్ గా ఈ విషయాలను పంచుకున్నారు ప్రభాస్. కేజీఎఫ్ సినిమా షూటింగ్ సమయంలో సెట్ మంటల్లో చిక్కుకోవడంతో బడ్జెట్ ఎక్కువైంది ఆ సమయంలో టీమ్ అంతా టెన్షన్లో ఉన్నారు. అప్పుడు విజయ్ ఒకే ఒక మాట చెప్పారు. రిలాక్స్ అవ్వండి, డబ్బు గురించి కాదు, ప్రొడక్షన్ గురించి ఆలోచించండి. నాకు క్వాలిటీ ముఖ్యం, మనీ కాదు అంటూ ఆయన చెప్పిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతనిలో ఉన్న ఆ లక్షణంతోనే ఆయనతో కలిసి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయడానికి కారణం అవుతుందని ప్రభాస్ స్పష్టం చేశారు. ఒక ప్రొడక్షన్ హౌజ్ గురించి ప్రభాస్ ఇంతలా పొగడడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం `ది రాజాసాబ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.