Prabhas | ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో ప్రభాస్. అదే ఉత్సాహంతో ఆయన వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం శనివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇమాన్వి కథానాయికగా పరిచయమవుతున్నది. 1940 నేపథ్యంలో నడిచే ఈ కథలో ప్రభాస్ వారియర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్నారు.
భారీ వ్యయంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సుధీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ-మోనిక, వీఎఫ్ఎక్స్: కమల్ కన్నన్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.