Kannappa Rebel Star Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే వరుస ప్రమోషన్స్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు విష్ణు. ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేశాడంటూ చెప్పుకోచ్చాడు. మరోవైపు మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు.