Prabhas – Raaja Saab | ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతేడాది సలార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు.. లేటెస్ట్గా కల్కి 2898 ఏడీతో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. అయితే సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కావడంతో ఇప్పటినుంచే వేడుకలు మొదలుపెట్టారు అభిమానులు. ఇక బర్త్‌డే రోజు అతడు నటించే సినిమాల నుంచి అప్డేట్లు కూడా రానున్నాయి. ఇదిలావుంటే డార్లింగ్ బర్త్‌డే కానుకగా రాజాసాబ్ నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
4.05PM…….🕺🏻
Nenu ready..
Meeru ready na?#Prabhas #TheRajaSaab pic.twitter.com/R15IzBO9dg— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024