Prabhas-Anushka | భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన ‘బాహుబలి’ సిరీస్ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క శెట్టి నటన, వారి మధ్య కనిపించిన అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘బాహుబలి’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందిన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ డాక్యుమెంటరీలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలతో పాటు నటీనటుల అనుభవాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పంచుకున్న జ్ఞాపకాలు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ డాక్యుమెంటరీలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ప్రభాస్, అనుష్క కలిసి కనిపించడం. చాలా కాలం తర్వాత ఈ జంట ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కోరుకుంటూ వస్తున్నప్పటికీ, తాము మంచి స్నేహితులమేనని ప్రభాస్, అనుష్క పలుమార్లు స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంటరీలో అనుష్క ఆకుపచ్చ రంగు ట్రెడిషనల్ దుస్తుల్లో అందంగా కనిపించగా, ప్రభాస్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్‌గా మెరిశాడు. ఇద్దరూ పక్కపక్కనే కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘దిష్టి తీయండి మా అన్నా వదినకి’, ‘ఇద్దరిని ఇలా చూడటం ఆనందంగా ఉంది’, ‘మా ఫేవరెట్ జంట మళ్లీ కనిపించింది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రభాస్-అనుష్క జోడీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కెరీర్లో విషయానికి వస్తే అనుష్క స్పీడ్ చాలా తగ్గించింది. ఇక ప్రభాస్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న ఫౌజీ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.