సౌండ్స్టోరీ పేరుతో ఆడియో క్లిప్‌ని రిలీజ్ చేసి, కేవలం సంభాషణల ద్వారానే ‘స్పిరిట్’ సినిమాపై ఆకాశమంత అంచనాలు పెంచేశారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘నాకో బ్యాడ్ హేబిట్ ఉంది..’ అంటూ ఆ క్లిప్‌లో ప్రభాస్ చెప్పిన డైలాగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? సందీప్‌రెడ్డి మార్క్ హీరోగా పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌ని ఎప్పుడు చూస్తామా? అని సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్‌పై సాలిడ్ న్యూస్ వినిపిస్తున్నది. వచ్చే నెల తొలివారం లోనే ‘స్పిరిట్’ షూటింగ్ మొదలుకానున్నదట. ఈ తొలి షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు పెద్ద శుభవార్తే. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనున్న ఈ పానిండియా చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు భాగం కానున్నారు. భధ్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.