Raja Delux Movie Shooting | ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ సాధించిన, ప్రభాస్ సినిమాల దూకుడు తగ్గించడంలేదు. ప్రస్తుతం ఆయన ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల గ్యాప్‌లో మారుతి సినిమాను సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరగుతుంది.
కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్లోనే జరుగుతుందట. రామోజీఫిలిం సిటీలో ఆచార్య సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సెట్లో ఫైటింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో భయం పుట్టుకుందట. భారీ అంచనాల నడుమ రిలీజైన ఆచార్య అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇక ఇప్పుడు ఆ సినిమా సెట్లోనే రాజా డిలక్స్ తెరకెక్కుతుండటం, ఆచార్య సెంటిమెంట్ ఈ సినిమాకు వర్తిస్తుందా అని అభిమానులను కాస్త భయాందోళనకు గురి చేస్తుందట.
హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక మొదటి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒకంత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను మారుతి హాండిల్ చేస్తాడా అనే డౌట్ అభిమానుల్లో ప్రతీ క్షణం మెదులుతుంది.