Adipurush | ఆదిపురుష్ సినిమాకు దేశమంతా సూపర్ క్రేజ్ ఉంది. టికెట్స్ కోసం అభిమానులు ఎన్నో తంటాలు పడుతున్నారు. కనీసం ఒక్క టికెట్ అయినా దొరక్కపోదా అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ఒక్క చోట మాత్రం ప్రభాస్ సినిమాపై పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. పైగా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. అన్నింటికీ మించి థియేటర్స్ కూడా చాలా తక్కువగా ఇచ్చారు. ఇది ఎక్కడో నార్త్ ఇండియాలో జరిగింది కాదు.. మన సౌత్ ఇండస్ట్రీలోనే జరుగుతుంది. మన దగ్గర అన్ని తక్కువ థియేటర్స్ ఆదిపురుష్ కు ఇచ్చిన వారు ఎవరు అనుకుంటున్నారా..?
ఇంకెక్కడ మన పక్కనే ఉన్న తమిళనాడులోనే ఇదంతా జరుగుతుంది. ఎందుకో తెలియదు కానీ చెన్నై సహా చాలా ప్రధాన నగరాల్లో ఆదిపురుష్ సినిమాకు నామమాత్రపు స్క్రీన్స్ మాత్రమే ఇచ్చారు. అలాగని జూన్ 16న అక్కడ ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతుందా అంటే అది కూడా లేదు. థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. అయినా కూడా ప్రభాస్ సినిమాకు సరిపోయే స్క్రీన్స్ ఇవ్వలేదు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ దానికి ప్రత్యేకంగా కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. అక్కడి వాళ్లకు రామాయణంపై పెద్దగా నమ్మకం లేదు అనేది ఎప్పటినుంచో నడుస్తున్న ప్రచారం. శ్రీలంక నుంచి వచ్చిన వాళ్లు చాలామంది తమిళనాడులోనే ఉన్నారు. పైగా కరుణానిధి లాంటి రాజకీయ నాయకులు కూడా రామాయణంపై ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఇప్పుడు ఆదిపురుష్ సినిమాపై ప్రభావం చూపిస్తుంది అని విశ్లేషకులు వాదిస్తున్నారు.
ఈ సినిమాకు అన్ని తక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికి కూడా కారణం ఇదే అంటున్నారు వాళ్లు. బుకింగ్ విషయంలో కూడా సినిమా వెనుక పడటానికి ప్రధానమైన రీజన్ ఇదే అనిపిస్తుంది. అక్కడ ఇప్పటి వరకు కనీసం 30% బుకింగ్స్ కూడా కనిపించడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా రామాయణం కావడంతో తమిళనాడు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. పైగా అక్కడ కొన్ని ప్రాంతాలలో రావణుడిని దేవుడులా కొలుస్తారు. ఆయనకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తారు. అలాంటిది ఇప్పుడు రామాయణంలో రావణుడు ప్రతి నాయకుడు. అందుకే ఈ సినిమాను ఒక రకంగా చెప్పాలంటే అన్ అఫీషియల్ గా బ్యాన్ చేశారని చెప్పొచ్చు. ఈ ప్రభావం కలెక్షన్ల పై కూడా భారీగా పడటం ఖాయం.
తమిళనాడు తర్వాత ఛండీగఢ్, అహ్మదాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ఆదిపురుష్ బుకింగ్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. అయితే ఈ కొన్ని ఏరియాలను పక్కన పెడితే మిగిలిన చోట్ల మాత్రం సినిమా దుమ్ము దులిపేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు 30 కోట్ల వరకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. మొదటి రోజు ఈ సినిమా ఖచ్చితంగా 110 నుంచి 130 కోట్ల మధ్య గ్రాస్ తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.
Kajal Aggarwal | సినిమాలకు కాజల్ గుడ్‌బై.. మళ్లీ తల్లి కాబోతుందా?
Pawan kalyan | ఓజీలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా ఎంట్రీ !
Chiranjeevi | 20 ఏండ్ల తర్వాత మళ్లీ అలాంటి సాహసం చేస్తున్న చిరంజీవి?
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు