Prabhas | సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, తెలుగు నుంచి ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి కలుగుతుంది. తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్, పుట్టిన తేది 23-10-1979గా చూపించబడింది. ఇందులో కనిపించిన ఆధార్ నంబర్: 5986 6623 9932. ఈ డాక్యుమెంట్ నిజమైనదా? లేక ఫేక్గానా అన్నది అధికారికంగా స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో ఇది ఫుల్ వైరల్ అవుతోంది. అభిమానులు ఇది గురించి చర్చించుకుంటున్నారు.
ఇక ప్రభాస్ పుట్టిన తేదీ విషయానికి వస్తే ఈయన ఆధార్ కార్డు ప్రకారం..23-10-1979 అని ఉంది. ఈ ఆధార్ కార్డ్ ద్వారా చూస్తే ప్రభాస్ వయసు 46 సంవత్సరాల అని తెలుస్తోంది. ఇప్పటికీ ప్రభాస్ బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఆయన పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 2002లో ‘ఈశ్వర్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ప్రభాస్,2004లో వచ్చిన ‘వర్షం’ సినిమాతో తన తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ఇండస్ట్రీని కొత్త రేంజ్‌కు తీసుకెళ్లింది. బాహుబలి 1, 2 రెండూ కలిపి ప్రభాస్‌ను ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు పొందిన హీరోగా నిలబెట్టాయి.
ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ మంచి సక్సెస్ అందుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ సినిమా మల్టీస్టారర్‌గా రూపొందగా, ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. ప్రస్తుతం ఆయన 25వ చిత్రం ‘స్పిరిట్’ ను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సలార్, కల్కి సీక్వెల్స్ కూడా చేయనున్నాడు.