మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విభిన్న కథా చిత్రం ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకుడు. నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృథ్వీ పెరిచర్ల నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పోయేకాలం నీకు..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. పృథ్వీ పెరిచర్ల ఈ పాట రాయగా, శివప్రసాద్ స్వరపరిచారు. యదుకృష్ణన్, వల్లవన్ ఆలపించారు. ఓ కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుందని మేకర్స్ తెలిపారు. రాకేశ్ మాస్టర్, కేఎల్కే మణిబమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాణం: వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్.