నా సినిమాను ఉచితంగా ఆడిస్తా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

pawan kalyan serious on Jagan | ఏపీలో జగన్, పవన్‌కళ్యాణ్ మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికార వైసీపీ, జనసేన మధ్య ఆ స్థాయిలో పోరు జరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలను ఆపేసి తనను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తన ఒక్కడిపై ఉన్న కోపంతో సినీ ఇండస్ట్రీపై పగ సాధిస్తున్నారని ఇదివరకే జగన్ ప్రభుత్వంపై ఇదివరకే పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. తన సినిమాలను ఆపేస్తే భయపడనని.. అంత పిరికి వాడిని కాదని స్పష్టం చేశారు. పంతానికి దిగితే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని సెన్సేషనల్ కామెంట్ చేశారు. పారదర్శకత అంటే అందరి విషయంలో ఉండాలని.. కొన్ని విషయాల్లో మాత్రమే ఉండకూడదంటూ హితవుపలికారు.సినిమా టికెట్లలో పారదర్శకత లేదు.. మరి ప్రభుత్వం జరిపే మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఉందా అని ప్రశ్నించారు. రూ.700తో మద్యం కొని 5రూపాయలతో సినిమాకు వెళ్లండని చెబుతారా? ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించారా? కనీసం శిలాఫలకం అయినా పెట్టారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్ కళ్యాణ్. ఏపీలో టికెట్ల ధరల విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయించింది. ఇందులో లీస్ట్ టికెట్ ధరను 5 రూపాయలుగా జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఛాయ్ ధర కంటే కూడా సినిమా టికెట్ రేటు తక్కువగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2024లో ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలి : పవన్ కల్యాణ్
Narayana swamy: జగన్ అంతానికి కుట్ర : చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఆరోపణ
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Pawan Kalyan: పవన్ కూతురిలో ఇంత టాలెంట్ ఉందా.. మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

