ఖుషీ సెంటిమెంట్‌తో వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు
Pawan Kalyan | భీమ్లా నాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. నిజానికి ఈ పండక్కి క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Pawan Kalyan | ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. అది వర్కవుట్ అయితే వదిలిపెట్టరు.. కలిసిరాకపోతే కనీసం దాని వైపు కూడా చూడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ నాలుగు సినిమాలో బిజీగా ఉన్నాడు. అందులో భీమ్లా నాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. నిజానికి ఈ పండక్కి క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు ( Hari Hara veeramallu ) సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో భీమ్లానాయక్ సినిమా వచ్చేసింది. దీంతో హరిహర వీరమల్లు సినిమా కోసం ఖుషీ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్.
భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. పైగా మొదటి సారి పవన్ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. ఏఎం రత్నం దాదాపు 100 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈయన ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు. హిస్టారికల్ సినిమాను బాగా తెరకెక్కిస్తాడనే పేరు క్రిష్ కు ఉంది. ఇప్పటికే ఈయన గౌతమీపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే పవన్ సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ తిరిగి మొదలు కాలేదు. దాంతో సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. సినిమాను సంక్రాంతికి కాకుండా వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక్కడే అసలు సెంటిమెంట్ దాగుంది.
పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఖుషి సెంటిమెంటు వాడబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. సరిగ్గా 20 ఏండ్ల కింద ఇదే తేదీన ఖుషీ సినిమా విడుదలైంది. ఏప్రిల్ 27, 2001న విడుదలైన ఖుషీ ఇండస్ట్రీ హిట్ అయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే తేదీన హరిహర వీరమల్లు సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. క్రిష్ కూడా దీనికి తగ్గట్లుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. 2022 చివర్లో హరీష్ శంకర్, పవన్ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
Power star | పవన్ కళ్యాణ్‌కు నిజంగానే అప్పులున్నాయా?
చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించిన సల్మాన్ ఖాన్..?
పుష్ప టీంను వణికిస్తున్న లీకుల బెడద.. బయటకొచ్చిన మరో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

