pushpa song leak | పుష్ప టీంను వణికిస్తున్న లీకుల బెడద.. బయటకొచ్చిన మరో సాంగ్
Pushpa song leak | పుష్ప సినిమాను లీకుల బెడద వేధిస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను కొంతమంది ఆకతాయిలు లీక్ చేస్తున్నారు. దీంతో వీళ్ల పని పట్టేందుకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను కూడా చిత్ర యూనిట్ ఆశ్రయించింది.

Pushpa song leak | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పుష్ప సినిమాను లీకుల బెడద వేధిస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను కొంతమంది ఆకతాయిలు లీక్ చేస్తున్నారు. దీంతో వీళ్ల పని పట్టేందుకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను కూడా చిత్ర యూనిట్ ఆశ్రయించింది. ముందుగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ దాక్కో దాక్కో మేక పాట దేవిశ్రీ ప్రసాద్ వర్షన్ లీకైంది. ఆ తర్వాత కొద్దిరోజులకే కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కూడా లీకైంది. ఇప్పుడు తాజాగా మరో పాట లీకవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పుష్ప సినిమాలోని మొదటి సింగిల్ దాక్కో దాక్కో మేక పాట దేవి శ్రీ ప్రసాద్ వర్షన్ లీకైనప్పుడు.. ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే జరిగిందని పలువురు అనుకున్నారు. కానీ ఆ వెంటనే సినిమాలో కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కూడా లీకైంది. దీంతో సీరియస్‌గా తీసుకున్న చిత్ర బృందం.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కష్టాన్ని అలా ఆన్లైన్లో పెట్టొద్దంటూ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అభిమానులను వేడుకుంది. పైరసీని అంతమొందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో నుంచి మరో పాట లీకవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. వల్లీ..వల్లీ అనే లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. రష్మిక, అల్లు అర్జున్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని తెలుస్తుంది. వాయిస్ అంత క్లారిటీగా లేకపోయినా పాట మాత్రం బయటికి వచ్చేసింది. బహుశా షూటింగ్ నుంచే ఎవరైనా ఈ పాటను రికార్డు చేసి లీక్ చేసుంటారని భావిస్తున్నారు.
మరోవైపు వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలోనూ పుష్ప యూనిట్‌కు టెన్షన్ తప్పట్లేదు. లీక్ అయిన ఫైట్ సీన్ ఓ స్టూడియో నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ వీఎఫ్ఎక్స్ సంస్థకే పుష్ప యూనిట్ ఏకంగా 47 నిమిషాల ఫుటేజ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. దాంతో కేవలం 19 సెకన్స్ ఫైట్ సీన్ మాత్రమే లీక్ అయిందా లేదంటే మొత్తం బయటికి వచ్చేసిందా అనేది అర్థం కావడం లేదు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కారణంగానే ఈ ఫుటేజ్ బయటకి వచ్చిందని చిత్ర బృందం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. మొత్తానికి పుష్ప సినిమా లీకులు మాత్రం అందరినీ కంగారు పెడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
Power star | పవన్ కళ్యాణ్‌కు నిజంగానే అప్పులున్నాయా?
చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించిన సల్మాన్ ఖాన్..?
పాగల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేశాయి.. బొమ్మ హిట్టా ఫట్టా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

