pawan kalyan and harish shankar | తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. చేసింది ఒక్క సినిమానే అయినా వాళ్లు చరిత్ర సృష్టిస్తుంటారు. అలాంటి కాంబినేషన్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్. ఈ ఇద్దరి పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా గబ్బర్ సింగ్ ( gabbar singh ). దాదాపు 11 ఏళ్ల పాటు ఎలాంటి విజయం లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ కు.. గబ్బర్ సింగ్ సినిమాతో ఎప్పటికీ మరిచిపోలేని విజయం అందించాడు హరీష్ శంకర్. ఇది పేరుకు హిందీ సినిమా రీమేక్ అయినా కూడా స్ట్రైట్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించాడు హరీష్. నిజానికి గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత ఒరిజినల్ దబాంగ్ సినిమా చేసిన సల్మాన్ ఖాన్ మెచ్చుకున్నాడు. తమకంటే సినిమా చాలా బాగా తెరకెక్కించారు అంటూ హరీష్ శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు సల్మాన్. అందులో కొన్ని సన్నివేశాలు తమ సినిమాల్లో వాడుకుంటామని చెప్పాడు కూడా.
దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. దాంతో అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హరీష్ శంకర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇక దీన్ని ఆలస్యం చేయకూడదని పవన్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ కీలక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 9 ఉదయం 9.45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నామంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇది నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది.. పండగ చేసుకోడానికి రెడీగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు మైత్రి నిర్మాతలు.
Get ready for Next Level Celebrations 💥
— BA Raju's Team (@baraju_SuperHit) September 8, 2021
A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM @PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro pic.twitter.com/kGVJtkxhZw
అదేంటో అని పవన్ అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడని తెలుస్తుంది. ఒకటి చాలా జోవియల్ గా ఉండే పాత్ర అయితే.. మరోటి మాత్రం ప్రశ్నించే పాత్ర. సామాజిక బాధ్యత కలిగిన పాత్ర అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో విద్యా వ్యవస్థను ప్రశ్నించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జెంటిల్ మెన్ నుంచి నిన్నటి యువరత్న సినిమా వరకు చాలా దాంట్లో విద్యావ్యవస్థను ప్రశ్నించారు హీరోలు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా పవన్ స్టైల్ లో తన శైలిలో ప్రశ్నించడానికి వచ్చేస్తున్నాడు. నెలకు పది రోజులు హరీష్ సినిమాకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ అందించిన హరీష్ శంకర్.. ఈసారి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ మెసేజ్ ఉన్న కథతో వస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
RC 15 Poster | కేవలం పోస్టర్ కోసమే శంకర్ కోట్లు ఖర్చు పెట్టించాడా..?
Nayanthara | పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం