150ఏండ్ల క్రితం నిజాం నవాబుల పాలనలో గోర్ బంజారాల జీవితాల్లో చోటుచేసుకున్న యథార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గ్యానిధార్’. ‘ది లిబెరేటర్’ అనేది ఉపశీర్షిక. కేశునందన్ దర్శకుడు. సోహాన్‌లాల్ రాథోడ్, కేసుల బ్రదర్స్ నిర్మాతలు. తెలుగు, హిందీ, బంజారా భాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రం పోస్టర్, టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నట, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి, రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు వి.సముద్ర, సంజీవ్‌కుమార్ రాథోడ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ప్రకృతి సంరక్షణ కోసం బంజారాలు చేసిన వీరోచిత పోరాటాలు, నవాబుల కాలంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాల నేపథ్యంలో సినిమా తెరకెక్కించామని దర్శకుడు కేశునందన్ తెలిపారు. జయసింగ్, సూర్య, సాంబయ్య తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈచిత్రానికి కెమెరా: మహి మడియన్ ఎంఎం, విజయ్.జి, సంగీతం: కల్యాణ్ కీస్.