Nidhhi Agerwal | సోషల్ మీడియా వచ్చాక, పనిలేని వాళ్లందరికీ పని దొరికినట్టయ్యింది. అదికూడా పైసా ఉపయోగం లేని పని. తమకే కాదు, సమాజానికి కూడా ఏ మాత్రం ఉపయోగం లేని పోస్టులను పెడుతూ ఏరోజుకారోజు సంతృప్తిని పొందే బ్యాచ్ కొందరు తయారయ్యారు. అలాంటి ఓ బ్యాచ్‌కి చెందిన ఒకడు.. హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆమెను శ్రీలీలతో పోలుస్తూ.. ‘2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఈమె ఏం చేసింది? ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల ఇప్పటికి 20 సినిమాలు చేసింది.’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు.
ఆ పోస్ట్ నిధి అగర్వాల్ కంటపడింది. దాంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. ‘ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తెలుగు, తమిళం కలిపి మూడ్నాలుగు సినిమాలు చేశా. ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మంచి స్క్రిప్ట్ అనుకుంటేనే సంతకం చేస్తున్నా. నాకు వరుసగా సినిమాలు చేయాలని లేదు. మంచి సినిమాల్లో భాగం కావడమే నాకు ముఖ్యం. ఇండస్ట్రీలో చాలాకాలం ఉండాలనుకుంటున్నా. కాబట్టి.. బ్రదర్ నా గురించి నువ్వేమీ బాధ పడకు..’ అంటూ కౌంటర్ ఇచ్చింది నిధి అగర్వాల్.