Por Thozhil Movie On Ott | థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడని వారేవ్వరు. ఇప్పుడని కాదు.. తరతరాల నుంచి థ్రిల్లర్ సినిమాలకు ఒక సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ముప్పై ఏళ్ల కిందట అన్వేషణ అనే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చూసి వణుకుపుట్టిన ప్రేక్షకులు ఎందరో. ఐతే, అనుకోకుండా ఒకరోజు ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఏసీలో కూడా చెమటలు పట్టించాయి. థ్రిల్లర్ సినిమాలకు సరైన కథ, కట్టిపడేసే కథనం ఉండాలని కానీ.. నిర్మాతల పాలిట కాసుల వర్షం కురిపిస్తాయి. ఈ మధ్య ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో కూర్చొబెట్టిన సినిమాలే రాలేవు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కిందట బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాను తీశాడు. ఈ సినిమా జనాలను మాములు భయపెట్టలేదు. తమిళ సినిమా రీమేకే అయినా.. తెలుగులో కథ పాడు చేయకుండా నీట్‌గా ప్రజెంట్ చేశారు. కట్ చేస్తే బెల్లంకొండ కెరీర్లో తొలి హిట్టయింది. క్రిటిక్స్ నుంచే కాకుండా కమర్షియల్గానూ ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది.
తమిళంలో రాట్ససన్ పేరుతో విష్ణు ఐదేళ్ల క్రితం ఈ సినిమా తీశాడు. ఇప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ థ్రిల్లర్ సినిమా అంటే రాట్ససన్ సినిమానే చెప్పుకుంటుంటారు. కాగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా రేంజ్‌లోనే తమిళంలో ఓ సినిమా వచ్చింది. అదే పోర్ తొలిల్. రెండు నెలల కిందట తమిళంలో రిలీజైన ఈ సినిమా అక్కడ నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. హీరో అశోక్ సెల్వన్ కెరీర్లో ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిందని తమిళ బ్యాచ్‌తో సహా చాలా మంది సినిమా చూసిన వాళ్ల చెబుతున్నారు. అంతేకాకుండా రాట్ససన్ సినిమాకు మించి ట్విస్ట్లున్నాయని రివ్వూలు ఇచ్చారు.
తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ పలు కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్దం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్‌లో ఆగస్టు 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్ కుమార్ కీలకపాత్ర పోషించాడు.