గజల్ మేస్ట్రోగా ప్రసిద్ధుడైన ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్(72) సోమవారం ముంబయిలో కన్నుమూశారు. ఆయన మే 17, 1951న గుజరాత్‌లోని జెటూర్‌లో జన్మించారు. 80, 90దశకంలో గజల్, నేపథ్య గాయకుడిగా మరపురాని పాటలను ఆలపించారు. ‘తుమ్ హసీన్ మే జవాన్’ (1970) సినిమా ద్వారా నేపథ్య గాయకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘నామ్’ చిత్రంలో ఆలపించిన ‘చిట్టి ఆయీ హై’ గీతం చాలా పాపురల్ అయింది. ‘గంగా జమున సరస్వతి’ ‘ఘాయల్’ ‘సాజన్’ ‘బేటా’ ‘దిల్ అష్నా హై’ ‘బాజీఘర్’ చిత్రాల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా గజల్ సింగర్‌గా ప్రసిద్ధుడైన ఆయన సినీ నేపథ్య గాయకుడిగా తనదైన ముద్రను వేశారు. 2006లో భారత ప్రభుత్వం పంకజ్ ఉదాస్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.