Kantara Chapter 1 | కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై.. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ‘కాంతార’. టాలెంటెడ్ కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్‌శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో మరోసారి కాంతార ప్రీక్వెల్‌గా వస్తుందని తెలిసిందే. కాంతార చాప్టర్ -1 (Kantara: Chapter 1) టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
కాంతార చాప్టర్ -1 ఫస్ట్ లుక్ టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ సారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అయిపోయినట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది. తొలిపార్టును రూ.16 కోట్లలోపే నిర్మించిన రిషబ్ శెట్టి.. ప్రీక్వెల్ కోసం రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కాగా ప్రీక్వెల్‌లో ప్రముఖ నటుడు కీ రోల్ చేస్తున్నాడన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది.
కాంతార చాప్టర్ -1 పాపులర్ మలయాళం యాక్టర్ జయరాం కీలక పాత్రలో నటిస్తున్నట్టు మాలీవుడ్ సర్కిల్ టాక్ కాగా.. జయరాం ఇప్పటికే షూట్లో జాయిన్ అయ్యాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారా..? అనేది చూడాలి.
జయరామ్ ఇప్పటికే భాగమతి, అల వైకుంఠపురంలో, గుంటూరు కారం సినిమాలతో తెలుగులో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజా అప్డేట్ నిజమే అయితే మరి ప్రీక్వెల్తో జయరామ్ స్టేటస్ పాన్ ఇండియా రేంజ్లో మార్మోగిపోవడం ఖాయమైనట్టేనంటున్నారు సినీ జనాలు.
ప్రీక్వెల్‌ను కూడా హొంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా.. మరోసారి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
కాంతార చాఫ్టర్ 1 టీజర్..