ముంబై: ప్రముఖ గుజరాతీ, హిందీ సినిమా నటుడు అమిత్ మిస్త్రీ(47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ముంబైలోని అంధేరీలో తన ఇంట్లోనే తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు అతని తల్లి వెల్లడించిందని అమిత్ మేనేజర్ మహర్షి దేశాయ్ చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అతడు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని మహర్షి తెలిపాడు.
ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన బాండిష్ బాండిట్స్ వెబ్‌సిరీస్‌లోనూ అమిత్ మిస్త్రీ నటించాడు. ఇది కాకుండా క్యా కహనా, ఏక్ చాలీస్ కీ లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ద సిటీ, యమ్లా పగ్లా దివానాలాంటి మూవీస్‌లో అతడు నటించాడు. అతని మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుమీత్ వ్యాస్, కుబ్రా సైత్, రాజేష్ తైలాంగ్ సంతాపం వ్యక్తం చేశారు.
I am shattered .
— Ashoke Pandit (@ashokepandit) April 23, 2021
Can’t believe this .
A dear friend , a brilliant actor on stage , tv & cinema Amit Mistry expired due to cardiac arrest today.
This is no age to go Amit
Speechless .
My Heartfelt condolences to his family .
ॐ शान्ति ! pic.twitter.com/jUpLzmZFiC