Poonam Pandey shocked | బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బాలీవుడ్ తార తన వివాదాస్పద మాటలతో పాటు పనులతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబై వీధుల్లో పూనం వెళుతుండగా.. ఒక అభిమాని తనతో సెల్ఫీ దిగుదాం అని వచ్చి ఏకంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అప్రమత్తమైన పూనమ్ పాండే అతడిని గట్టిగా తోసేసి పక్కకు తప్పుకుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫ్యాన్‌ని తిడుతూ పూనం పాండేకి మద్దతుగా నిలుస్తున్నారు. నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.
Actress-model #PoonamPandey constantly grabs headlines for some reason or the other.
On Friday (February 21), the model-actress was left in shock during a paparazzi session after a male fan came from behind and attempted to take a selfie with her.
In a video shared online,… pic.twitter.com/gLhzSQYigl
— Hate Detector 🔍 (@HateDetectors) February 21, 2025