Poonam Pandey | మోడల్, నటి పూనం పాండే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు, పబ్లిసిటీ స్టంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనం, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలతో నెట్టింట కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం పూనం పాండే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో తన టీ-షర్ట్‌ను పైకి లేపి బేబీ బంప్‌ను చూపిస్తుండగా, మరో ఫోటోలో కెమెరా వైపు తిరిగి ప్రెగ్నెన్సీని హింట్ ఇస్తూ పోజులిచ్చింది. ఈ ఫోటోలకు గర్భిణీ స్త్రీ, పాల బాటిల్, చిన్నారి ఎమోజీలను జత చేయడంతో.. తాను త్వరలో తల్లిని కాబోతుందనే సందేశం ఇచ్చినట్టైంది.
అయితే, పూనం పాండే గతంలో చేసిన పబ్లిసిటీ స్టంట్ల కారణంగా నెటిజన్లు ఈ వార్తను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నిజంగా ప్రెగ్నెన్సీనా? లేక మరోసారి పబ్లిసిటీ స్టంటా అంటూ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే కావడంతో ముందుగానే ప్లాన్ చేసిన ప్రాంక్ అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎడిట్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు, కొత్త సినిమా లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ స్టంట్ చేసి ఉంటారని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.
పూనం పాండేను నెటిజన్లు నమ్మకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన ఒక వివాదం. 2024 ఫిబ్రవరి 1న ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందని అధికారిక ప్రకటన వెలువడింది. కానీ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే అలా చేశానని చెప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ ఘటన తర్వాత ఆమెపై నమ్మకం తగ్గిందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూనం పాండే కెరీర్ మొదటినుంచే వివాదాలతో నిండి ఉంది. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో టీమిండియా గెలిస్తే బట్టలు విప్పుతానని ప్రకటించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అలాగే, వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు ఎదుర్కొన్నారు. 2020లో సామ్ బాంబేని పెళ్లి చేసుకుని, కొద్ది రోజుల్లోనే అతనిపై గృహహింస ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. అలాగే లాక్ అప్ రియాలిటీ షోలో కూడా తన బోల్డ్ యాటిట్యూడ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.