‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతుంది. ప్రధానంగా ప్రకాశ్ రాజ్(Prakash Raj) ప్యానెల్, మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ మధ్య పోటీ నెలకొనగా..గెలుపుపై ఎవరి ధీమా వారిదే ఉంది. ఇప్పటికే జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేశ్ నామినేషన్ ఉపసంహరించుకుంటూ..తాను ప్రకాశ్ రాజ్ కే ఓటేస్తానని ప్రకటించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ కే తన మద్దతు అని టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (poonam kaur) తెలియజేసింది.
త్వరలో జరుగబోయే మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలువాలని కోరుకుంటున్నానని తెలిపింది. ప్రకాశ్ రాజ్ టీంకు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ప్రకాశ్ రాజ్ గెలిస్తే చాలా కాలంగా నేను ఎదుర్కొన్న సమస్యలను ఆయన ముందు ఉంచుతాను. ఎక్కువ కాలం నిశ్శబ్దంగా ఉంటాను. ప్రకాశ్ రాజ్ మాత్రమే వాస్తవికంగా, రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఆయన చిల్లర రాజకీయాల్లో పాల్గొనరు. పెద్దలకు గౌరవంగా చెప్పేవారు..చెప్పిన వాటికి కట్టుబడి ఉంటారు. జైహింద్ అని ట్వీట్ చేసింది.
Want #prakashraj sir to win #maaelections , if he does I will put up the issues I have faced and kept quiet for the longest time , he is the only one who is apolitical and doesn’t get involved in petty politics ,with all due respect to elders will adhere to what they say .Jaihind pic.twitter.com/1lwJDwlLfs
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 1, 2021
మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ కు మా మాజీ అధ్యక్షుడు నరేశ్ అండ్ టీం మద్దతునిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ మోహన్ బాబు సూపర్ స్టార్ కృష్ణను కలిసి మంచు విష్ణు ప్యానెల్ కు ఆయన మద్దతు కోరారు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మా ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నారు. రాత్రి 7 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు.
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?