Poonam Kaur | ఎప్పటి నుండో త్రివిక్రమ్-పూనమ్ కౌర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరం, విమర్శలు, పరోక్ష సెటైర్లు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తూనే ఉన్నాయి. కానీ ఈ వివాదానికి అసలు మూలం ఏంటి? పూనమ్‌కు జరిగిన అన్యాయం ఏమిటి? త్రివిక్రమ్‌పై ఆమెకు ఎందుకంత వ్యతిరేకత చూపిస్తుంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఒకప్పుడు పరోక్షంగా ‘‘గురూజీ’’ అంటూ కామెంట్లు చేసిన పూనమ్, తర్వాత నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ ఘాటైన విమర్శలు చేసింది.
జల్సా సినిమా సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో త్రివిక్రమ్ తనను పట్టించుకోలేదని, ఆఫర్లు ఇవ్వనందుకే అలా చేస్తుందని కొందరు వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన పూనమ్ ఎప్పుడూ అవకాశాల కోసం నేను ఎవరినీ వేధించలేదు, రిజెక్ట్ చేసిన సినిమాలే ఎక్కువ అని పేర్కొన్నారు. త్రివిక్రమ్‌పై గతంలో ‘మా’ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశానని పూనమ్ కౌర్ స్వయంగా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఇటీవలే సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న దర్శకుడిపై అసోసియేషన్ చర్యలు తీసుకుందా? ఆమె ఆరోపణలకు పక్కా ఆధారాలున్నాయా? అనే విషయాల్లో ఇంకా స్పష్టత లేదు.
తాజాగా, పూనమ్ కౌర్ మరోసారి త్రివిక్రమ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈసారి దర్శకుడు క్రిష్ పేరు తీస్తూ ట్వీట్ చేశారు. క్రిష్ లాంటి వారు తమ సొంత కథలపై నమ్మకంతో, అథెంటిక్‌గా సినిమాలు తీస్తారు. కానీ వారి కంటే పీఆర్ స్టంట్లు చేసే వారికి, కాపీ కథలు రాస్తున్న వారికి ఎక్కువ గుర్తింపు వస్తుంది అంటూ పరోక్షంగా త్రివిక్రమ్‌పై కామెంట్స్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకి దగ్గరపడుతున్న సమయంలో పూనమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హరిహర వీరమల్లు సినిమాకు మొదట దర్శకుడు క్రిష్ అయినా, తర్వాత జ్యోతికృష్ణ సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే.