Poonam Kaur – Trivikram | టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి పూనం కౌర్. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌పై పలుసార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్ మరోసారి విరుచుకుపడింది.
టాలీవుడ్లో ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో జానీని మాస్టర్ అని పిలవకండి అలా పిలవాలంటే కనీసం గౌరవం ఉండాలి అంటూ చెప్పుకోచ్చింది. ఈ క్రమంలోనే తాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇచ్చిన కంప్లయిట్ను తీసుకున్నారా అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ప్రశ్నించింది. నాలాంటి వాళ్లకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. అందుకే నన్ను సైలెంట్ గా పక్కనబేట్టేశారు. నేను అప్పుడు మా అసోసియేషన్‌లో ఉన్న పెద్దవాళ్లకి కంప్లయింట్ చేశాను. ఇప్పుడైన ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని కోరుతున్నాను అంటూ పూనం రాసుకోచ్చింది.
అంతకుముందు కూడా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ భామ. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని మరోసారి ఫైర్ అయింది.