Poonam Bajwa | తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపించకపోయినా తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూనమ్ బజ్వా. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలకన్నా సోషల్ మీడియా ప్లాట్ఫాంల్లోనే ఎక్కువగా కనిపించే ఈ బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర చిట్‌చాట్‌లో పాల్గొంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పూనమ్ తన అభిమానులతో “Ask Anything” అనే ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించింది. అందులో కొందరు ఫ్యాన్స్ ఆమె అందం, అభిరుచుల గురించి ప్రశ్నలు వేయగా, పూనమ్ వాటికి ఫన్నీగా, ఒపెన్‌గా సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ఓ స్టెప్ ముందుకు వేశాడు.
పూనమ్ బజ్వాకు “పూజా జీ ఐ లవ్ యూ” అంటూ ప్రపోజ్ చేశాడు. దాంతో పూనమ్ మొదట కొద్దిగా షాక్ అయినా, వెంటనే తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించింది.”అది నువ్వు పూజాను అడగాలి.. నేనైతే లవ్ చేయను?” అని సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ రిప్లైతో పూనమ్ తన హ్యూమర్ సెన్స్‌ని మళ్లీ ప్రూవ్ చేసింది. పూనమ్ ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూనమ్ బజ్వా ముంబయిలోని పంజాబీ ఫ్యామిలీకి చెందింది. 2005లో “మిస్ పూణె” కిరీటం గెలిచిన తర్వాత మోడలింగ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ఆమె తెలుగు చిత్రంగా “మొదటి సినిమా” ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది.
తర్వాత బాస్, వేడుక, పరుగు, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించింది. తెలుగు , తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పూనమ్ ప్రస్తుతం కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. పర్సనల్ లైఫ్‌ని ప్రైవేట్‌గా ఉంచుతూ, ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా నేరుగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. పూనమ్ బజ్వా ఇలా సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం, ఫ్యాన్స్‌తో ఇలా ముచ్చటించడం చూసిన తర్వాత… మళ్లీ వెండితెరపై ఈ అందాల నటి రీ ఎంట్రీ ఇస్తుందా అని అందరు చర్చించుకుంటున్నారు.