Pooja:పూజా దూకుడు తగ్గట్లేదుగా.. ఐకాన్లోను ఆమెనే కథానాయిక!

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు ఈమె చిరంజీవి ’ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇంకోవైపు అఖిల్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతుంది పూజా హగ్డే. తమిళంలో దళపతి విజయ్ సరసన భీస్ట్ చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్- త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో మెరిసిన పూజా మళ్లీ త్రివిక్రమ్ సినిమాకు హీరోయిన్గా కన్ఫాం అయింది.
టాప్ హీరోలకు గోల్డెన్ బ్యూటీగా మారిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ నటించనున్న ఐకాన్లోను కథానాయికగా నటించనుందని, ఇది దాదాపు కన్ఫాం అని అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ త్వరలోనే తన తదుపరి చిత్రం అయిన “ఐకాన్” ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒకరు పూజా కాగా మరొకరు ఎవరన్నది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Icon
- Pooja hegde
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

