Pooja Looks Haseen | బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) టైటిల్ రోల్లో నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్. ఈ సూపర్ హిట్ ఫిల్మ్‌కు సీక్వెల్‌గా డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) వస్తోందని తెలిసిందే. మరోసారి పూజాగా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఇటీవలే హాఫ్ లుక్‌ను విడుదల చేస్తూ.. విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా పూజా ఎంత హాట్‌గా ఉండబోతుందో తెలియజేస్తూ ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు.
ఆయుష్మాన్ ఖురానా మేల్ గెటప్ నుంచి ఫీ మేల్ గెటప్ (పూజా)లోకి మారుతున్న రెండు స్టిల్స్ తాజా లుక్‌లో కనిపిస్తుండగా.. లిప్‌స్టిక్ పెట్టుకొని హాట్ హాట్ లుక్‌లో కట్టిపడేస్తూ హీరోయిన్లకు టఫ్ ఫైట్ ఇస్తా అన్నట్టుగా మెస్మరైజ్ చేస్తున్నాడు. డ్రీమ్ గర్ల్ 2 మరోసారి ప్రేక్షకులకు సూపర్ థ్రిల్‌తోపాటు రెట్టింపు వినోదాన్ని అందించడం ఖాయమని తాజా పోస్టర్ చెబుతోంది.
ఈ మూవీలో ఆయుష్మాన్ కరమ్‌వీర్ సింగ్‌గా.. పూజాగా రెండు షేడ్స్‌లో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సీక్వెల్‌కు కూడా రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. డ్రీమ్ గర్ల్ 2ను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో లైగర్ ఫేం అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Dream Girl 2 హాట్ లుక్..
Yeh toh sirf pehli jhalak hai. Objects in the mirror are more khoobsurat than they appear! 😉❤️#DreamGirl2on25Aug #25AugustHogaMast#OneMonthToGo@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/0npWeiXhiv
— Ayushmann Khurrana (@ayushmannk) July 25, 2023
Pachees badi hai mast mast,
kyunki @Pooja_DreamGirl aa rahi hai on 25 अगस्त.😘😉
#PoojaKiKissOnAug25 💋#DreamGirl2 releasing in theatres on 25th August, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/OVIbVs0cqo— Ayushmann Khurrana (@ayushmannk) April 24, 2023