చిత్రసీమలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేం. కెరీర్ ఆరంభంలో ఐరెన్‌లెగ్‌గా ముద్రపడిన మంగళూరు సోయగం పూజా హెగ్డే అనంతరం వరస సినిమాలో బిజీగా మారింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో చిత్రాల ద్వారా తారాపథంలో దూసుకెళ్లింది. అయితే గత ఏడాది ఈ భామకు నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఆమె నటించిన భారీ చిత్రాలు వరుసగా పరాజయం చెందడంతో రేసులో వెనకబడింది.
ఇటీవల మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి కూడా పూజాహెగ్డే తప్పుకుంది. ప్రస్తుతం కెరీర్లో బ్యాడ్‌టైమ్ నడుస్తున్నా త్వరలో మంచిరోజులొస్తాయని తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నదట పూజాహెగ్డే. తమిళంలో ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న చిత్రంలో ఈ భామను నాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. తెలుగులో కూడా ఓ స్టార్ హీరో చిత్రంలో నాయికగా ఆమె పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది తన కెరీర్ తిరిగి విజయాల బాట పట్టడం ఖాయమని విశ్వాసంతో ఉందట పూజాహెగ్డే.