Pooja Hegde | బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తాజాగా వరుస అవకాశాలతో హిందీ సినిమాల్లో తన సత్తా చాటుతున్నది. సినిమాల్లోకి రావడం గొప్పగా భావిస్తున్నానని చెబుతున్న పూజ తన ఇష్టాలను ఇలా పంచుకుంది..
జీవితమంటే: కలలు, జ్ఞాపకాల సమాహారం. పూజ ఎలాంటి అమ్మాయి: నాకు ఆశలూ ఎక్కువే, ప్రాక్టికల్‌గానూ ఆలోచిస్తాను. ఎమోషనల్‌గా కూడా ఉంటాను. గొప్పగా ఫీలైన సందర్భం: సినిమా ఇండస్ట్రీకి రావడం. మంచి పాత్రలు లభించినప్పుడల్లా గొప్పగా భావిస్తాను. డ్రీమ్ కో-స్టార్ అంటే ఎవరి పేరు చెబుతారు: రణ్‌బీర్‌కపూర్, ఆల్‌టైమ్ లెజెండ్ అమితాబ్ సార్.
నచ్చిన సినిమాలు: దేవదాసు, మొఘల్-ఎ-ఆజమ్, చాందినీ, లా లా ల్యాండ్
హృతిక్ రోషన్‌లో మెచ్చేది: అతని గ్రేస్
అక్షయ్ కుమార్ అంటే..: ఫిట్నెస్, పంక్చువాలిటీ
రణ్‌వీర్‌సింగ్ నుంచి నేర్చుకున్నది..: అనుకున్నది చెప్పేయడం
మగవాళ్లు ఎలా ఉంటే ఇష్టం: తమ చుట్టూ ఉన్నవారిని గౌరవించేవాళ్లంటే ఇష్టం.