Pooja Hegde | రెండేళ్లుగా మంచి విజయం కోసం నిరీక్షిస్తోంది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. గత ఏడాది ఈ భామ తెరపై కనిపించలేదు. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నానని, అందుకే కాస్త బ్రేక్ తీసుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఈ భామ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో దళపతి విజయ్, సూర్య చిత్రాల్లో నాయికగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఈ సినిమాలు తనకు బ్రేక్నిస్తాయని, నాయికగా తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు తమిళంలో మరో బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది. రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని గత కొద్దినెలలుగా వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె దాదాపుగా ఖరారయ్యారని తెలిసింది. ఇందులో పూజాహెగ్డే డెవిల్ రోల్లో నటించనుందని అంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.