సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, మౌనంగా భరించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే, తాజాగా నోరు విప్పింది. తనపై వస్తున్న నెగెటివిటీకి చెక్ పెడుతూ, ట్రోలర్స్‌కి సరైన సమాధానం ఇచ్చింది. ‘నాకు ఇన్‌స్టాలో 30 మిలియన్ల కంటే ఎక్కువమంది ఫాలోవర్లున్నారు. అంతమాత్రాన నా సినిమా విడుదలైతే వారంతా టికెట్లు కొంటారని అనుకోవడం పొరపాటు.
సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది జస్ట్ నంబర్ అంతే. అది సినిమా విజయంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇండస్ట్రీలో కొంతమందికి సోషల్ మీడియాలో కేవలం 5 మిలియన్ల ఫాలోవర్లే ఉంటారు. కానీ థియేటర్లలో వారికి ఉండే క్రేజ్ నెక్ట్స్ లెవల్. వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రాబడతాయి. నా దృష్టిలో వారే నిజమైన సూపర్‌స్టార్స్. దీన్ని బట్టి నేను చెప్పేదేంటంటే.. నాలాంటి హీరోయిన్లకు ప్రేక్షకులే ముఖ్యం. ఏమాత్రం ఉపయోగం లేని ఇన్‌స్టా ఫాలోవర్స్ కాదు’ అంటూ ఘాటుగా స్పందించింది పూజా హెగ్డే.