Pooja Hegde | అల్లు అర్జున్-అట్లీ కాంబో సినిమాలో బుట్టబొమ్మకు భారీ ఆఫర్.. అంత డిమాండ్ చేసిందా?
Pooja Hegde | సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోయిన్గా బిజీగా ఉంటూనే ఐటెం సాంగ్స్ ద్వారా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మొన్నటికి మొన్న రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన “కూలీ” సినిమాలో “మోనికా లవ్ యూ మోనికా” పాటతో ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే, ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Pooja Hegde | సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోయిన్గా బిజీగా ఉంటూనే ఐటెం సాంగ్స్ ద్వారా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మొన్నటికి మొన్న రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన “కూలీ” సినిమాలో “మోనికా లవ్ యూ మోనికా” పాటతో ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే, ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూజా
“రంగస్థలం”లో “జిగేల్ రాణి”గా కూడా మెరిసింది. ఆ తర్వాత “F3”లో కూడా స్పెషల్ సాంగ్‌లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హీరోయిన్గా లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ రెండు వైపులా క్రేజ్, సంపాదన పెంచుకుంటోందని టాక్.
తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్, కోలీవుడ్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతోందట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన చర్చ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా దాదాపు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకొనె హీరోయిన్గా, మృణాల్ ఠాకూర్ మరో కీలక పాత్రలో నటించనుందన్న బజ్ ఉన్నా, చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది .
దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో చిత్రాలతో మంచి విజయాలని అందించిన ఈ జంటను మళ్లీ తెరపై చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్‌గా మారింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే ₹5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందన్న టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.తమన్నా భాటియా మాదిరిగానే హీరోయిన్గా, స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తూ పూజా హెగ్డే తన మార్కెట్‌ను నిలబెట్టుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు అట్లీ సినిమా కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

