Pooja Hegde | అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురంలో చిత్రాలతో సూపర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే (Pooja Hegde). బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన పూజా హెగ్డేకు కొంతకాలంగా మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఈ భామ నటించిన భారీ చిత్రాలు రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం మహేశ్ బాబుతో నటిస్తోన్న తెలుగు ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 28 మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్ట్ గతేడాదే షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా.. ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ఎలాంటి షూటింగ్ షెడ్యూల్స్ లేకపోవడంతో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటుందట. అయితే ప్రస్తుతం రిలాక్సింగ్ మూడ్‌లో ఉన్న పూజాహెగ్డే ఐటెం సాంగ్స్ (Item songs )కోసం చూస్తున్నట్టుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఊ అంటావా మావా సాంగ్ సమంతకు ఏ రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌లో మెరిసిన తర్వాత సామ్ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తనకు కూడా ఇలాంటి కెరీర్ బూస్ట్ సాంగ్స్ చేసే అవకాశమొస్తే బాగుంటుందని పూజా ఎదురుచూస్తుందట.
లాక్డౌన్ పీరియడ్‌లో హీరోలు, దర్శకనిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం ఐటెం సాంగ్స్ కోసం చూస్తుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరి పూజాహెగ్డే గురించి తెలిసిన దర్శకనిర్మాతలు రాబోయే సినిమాలో ఇలాంటి క్రేజీ ఆఫర్లేమైనా ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. పూజా హెగ్డే ఇప్పటికే రాంచరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి స్పెషల్ సాంగ్‌లో మెరవగా.. సూపర్ క్రేజ్ సంపాదించింది.