Pooja Hegde| ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఆ తర్వాత డల్ అయింది. వరుస పరాజయాలతో ఆమెకి అవకాశాలే కరువయ్యాయి. స్టార్ హీరోలతో కలిసి పని చేసిన పూజా హెగ్డే ఇప్పుడు చిన్న హీరోలతో కూడా పని చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే పూజా హెగ్డేకి ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తుంది. అవి రెండూ భారీ మూవీస్ కావడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `కూలీ`లో స్పెషల్ సాంగ్ కూడా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలు పూజా హెగ్డేకి ఎంత వరకు ప్లస్ అవుతాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య, అఖిల్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో నటించింది. క్రేజ్ ఉన్న సమయంలో రెచ్చిపోయింది. రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేసింది. వచ్చిన అవకాశాలని దేనిని వదులుకోలేదు. అయితే ఇందులో కొన్ని దెబ్బ కొట్టడంతో పూజా ఇప్పుడు రూట్ మార్చింది. కంటెంట్ ఉన్న సినిమాలు, బలమైన పాత్రలే చేయాలని అనుకుంటుందట. ఇప్పుడు కోలీవుడ్‌లో పూజా నటిస్తున్న విజయ్ `జన నాయగన్`, సూర్య `రెట్రో` చిత్రాలు కూడా అలాంటివే అని తెలుస్తుంది.
అయితే క్రేజ్ ఉన్న సమయంలోనే పూజా హెగ్డే `రంగస్థలం`లో జిగేల్ రాణి అనే స్పెషల్ సాంగ్‌కి చిందులేసింది. ఆ పాట థియేటర్లని ఊపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించి `కూలీ`లో ఐటెమ్ సాంగ్ ఉంటుందట. అందులో కింగ్ నాగార్జునతో ఈ అమ్మడు ఆడిపాడనుందని అంటున్నారు. ఊరమాస్‌గా ఈ పాట ఉండనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో నాగ్‌తో కలిసి పార్టీలో తెగ రచ్చ చేయనుందట. ఇందులో పూజా లుక్ కూడా అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. కాగా, రజనీకాంత్ `కూలీ`లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెగటివ్ షేడ్ ఉన్న రోల్ అని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే నాగ్ తనయులు నాగచైతన్యతో `ఒక లైలా కోసం`, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రాల్లో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు నాగార్జునతో చిందులేయడం హాట్ టాపిక్‌గా మారింది.