‘రెట్రో’ సినిమా సక్సెస్‌తో మంగళూరు సోయగం పూజాహెగ్డే పట్టరాని సంతోషంతో ఉంది. ఈ భామకు గత రెండేళ్లుగా ఒక్క సక్సెస్ రాలేదు. అగ్ర హీరోలతో నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ భామ కెరీరే ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య సరసన నటించిన ‘రెట్రో’ చిత్రం ఈ భామ కెరీర్‌కు కొత్త ఊపిరిలూదింది. ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో పూజాహెగ్డే అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. చాలా విరామం తర్వాత ఆమె నటిగా సత్తాచాటిందని, ఇకపై ఇలాంటి రోల్స్ ఎంచుకోవాలని సోషల్‌మీడియాలో అభిమానులు అభిప్రాయపడ్డారు.
‘రెట్రో’ సక్సెస్‌తో తన కెరీర్‌కు మంచి రోజులొచ్చాయని, ఇకపై కథాంశాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని, గ్లామర్ రోల్స్‌తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంపిక చేసుకుంటానని అభిమానులకు భరోసానిస్తున్నది పూజాహెగ్డే. తమిళంలో తాను విజయ్‌తో చేస్తున్న ‘జన నాయగన్’, లారెన్స్‌తో నటిస్తున్న ‘కాంచన-4’ చిత్రాలు తప్పకుండా భారీ హిట్స్‌గా నిలుస్తాయనే ధీమాతో ఉందట పూజాహెగ్డే. మొత్తానికి ‘రెట్రో’ విజయంతో పూజాహెగ్డే మళ్లీ సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.