అంతా మంచి జరిగితే నెత్తిన పెట్టుకుంటున్నారు,లేదంటే పక్కకు నెట్టేస్తున్నారు. గతంలో చాలా ముద్దుగుమ్మల విషయంలో ఇలానే జరిగింది. తాజాగా బుట్టబొమ్మ సక్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. జీవా హీరోగా మిస్కిన్ రూపొందించిన తమిళ చిత్రం ముగాముడి
తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పూజా హెగ్డే ఆ తరువాత ఒక లైలా కోసం
చిత్రంతో తెలుగులో తన అదృష్టాన్నిపరీక్షించుకుంది.
అరవింద సమేత.. మహర్షి, గద్దలకొండ గణేష్,అల వైకుంఠపురములో ఇలా వరుసగా విజయాలు తలుపుతట్టడంతో పూజా క్రేజ్ అమాంతం పెరిగింది. ఆమెకు తెలుగులోనే కాదు తమిళం,హిందీ భాషలలోను వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్గా అక్కినేని అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చేసింది. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో పూజని గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు.
చూస్తుంటే రానున్న రోజులలో పూజా హెగ్డే అందరికి ఫస్ట్ ఆప్షన్‌గా మారనుందని అర్ధమవుతుంది. ప్రస్తుతం తమిళంలో బీస్ట్ అనే చిత్రం చేస్తున్న పూజా హెగ్డే.. హిందీలోను పలు సినిమాలు చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది.