‘వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే.. అది ఒక్కో రంగంలో ఒక్కో విధంగా ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి వాటి స్థాయి ఉంటుంది.’ అంటున్నారు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. సినీ పరిశ్రమలో స్త్రీలపై వివక్ష గురించి ఓ విలేకరి అడిగి ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘హీరోల వ్యానిటీ వ్యాన్ని సెట్‌కు పక్కనే ఉంచుతారు.
మిగతా అందరివీ దూరంగా ఉంటాయి. మేం ఏ విధమైన కాస్ట్యూమ్స్ ధరించినా.. మా వ్యానిటీ వ్యాన్ నుంచి సెట్ వరకూ, మళ్లీ సెట్ నుంచి మా వ్యాన్ వరకూ నడుచుకుంటూ తిరగాల్సిందే. ఒక్కోసారి బరువైన లెహంగాలు ధరించినప్పుడైతే వాటిని ఈడ్చుకుంటూ వెళ్లాలి.. షాట్ ఆయ్యాక మళ్లీ అలాగే వ్యాన్ దగ్గరకు రావాలి. అవి చూడ్డానికి బాగానే ఉన్నా.. వాటిని మోసే మాకు తెలుస్తుంది బాధ.’ అంటూ చెప్పుకొచ్చింది పూజా.
ఇంకా చెబుతూ ‘క్యారెక్టర్ కోసం అంత కష్టపతాం. కానీ ఒక్కోసారి పోస్టర్‌పై మా పేర్లు కూడా ఉండవ్. సినిమా అనేది సమిష్టి కృషి. ఈ విషయం వారికెందుకు అర్థం కాదు?. లవ్‌స్టోరీల్లో కూడా హీరోయిన్లకు గుర్తింపు ఇవ్వరు. నిజానికి అందరూ నా అభిమాన హీరోలే. వారందరూ మాతో బాగానే ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లే ఓవర్ యాక్షన్ చేస్తారు.’ అంటూ మనసును ఆవిష్కరించింది పూజా హెగ్డే.