బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకొని అపజయాల్ని చవిచూసిన అగ్ర కథానాయిక పూజాహెగ్డే ప్రస్తుతం దక్షిణాదిలో పూర్వ వైభవాన్ని సాధించే పనిలో ఉంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీపై ఈ భామ దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే భారీ చిత్రాలను అంగీకరించింది. వాటిలో దళపతి విజయ్ ‘జననాయగన్’, రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ చిత్రాలున్నాయి. దుల్కర్ సల్మాన్ చిత్రంలో కూడా నాయికగా ఎంపికైంది. తాజాగా ఈ సొగసరికి మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం దక్కినట్లు తెలిసింది.
‘అమరన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో చేయబోతున్నారు. సామాజికాంశాలతో కూడిన హ్యుమన్ డ్రామా ఇదని సమాచారం. ఇందులో కథానాయికగా పూజాను ఎంపిక చేశారట. పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్ర ఇదని, ఆమె కెరీర్‌కు కీలకమవుతుందని అంటున్నారు. ఆమె తొలిసారి ధనుష్‌తో కలిసి నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.