Cinema News | గత ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీకి జాన్’ తర్వాత పూజా హెగ్డే సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దాదాపు ఏడాది నుంచి తమ అభిమాన తార వెండితెరపై కనిపించకపోవడం పూజా అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్న అంశం. అయితే.. ఈ బాధ ఈ ఏడాది అక్టోబర్ 11 వరకేనని, ఆ రోజు షాహిద్కపూర్తో తాను నటిస్తున్న ‘దేవ’ విడుదల కానున్నదని, అందులో కొత్త పూజాని చూస్తారని అంటున్నారు మంగళూరు భామ పూజా హెగ్డే.
తన కెరీర్లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ‘దేవ’లో చేస్తున్నట్టు పూజ చెప్పారు. ఓ హై ప్రొఫైల్ కేస్ ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని, కథనం షాక్‌కు గురిచేస్తుందని, తన పాత్ర తీరుతెన్నులు ఆడియన్స్‌ని షాక్‌కి లోనుచేస్తాయని పూజా తెలిపారు.