Ponniyin Selvan | సినిమాల యందు మణిరత్నం సినిమాలు వేరయా. మణిరత్నం నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈయన టేకింగ్, విజువలైజేషన్ గాని వేరే లెవల్లో ఉంటాయి. ఈయన సినిమాల్లో కథలు సాధారణంగానే ఉన్న కథనం గొప్పగా ఉంటుంది. ఇప్పుడోస్తున్న ఫిలింమేకర్స్ అందరు దాదాపుగా మణిరత్నం అభిమానులే అయ్యుంటారు. ఎందుకంటే మణిరత్నం తన సినిమాలతో ఎంటర్టైన్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకులను ఆలోచింప చేస్తుడు. ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా మణిరత్నంతో ఒక్క సినిమా చేయాలని ఆశ పడుతుంటారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం పొన్నియున్ సెల్వన్.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ. 125కోట్లు డీల్ కుదిరించకున్నట్లు సమాచారం. రెండు పార్టులకు కలిపి అమేజాన్ ఇంత మొత్తానికి కొనుగోలు చేసిందట. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.