మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి చోళరాజుల నేపథ్య ఇతివృత్తంతో రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తొలిభాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ఈ చిత్రంలో చోళరాజుల చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేశారని సెల్వన్ అనే న్యాయవాది చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ అనే పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. చిత్ర పోస్టర్లో ఆయన నుదిటిన తిలకం ఉందని, టీజర్లోమాత్రం తిలకం తీసివేసి చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. కథలో ప్రామాణికతను తెలుసుకోవడానికి తనకు ప్రత్యేకంగా షో వేయాలని సెల్వన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్ పాత్రను పోషించిన నటుడు విక్రమ్‌కు నోటీసులు పంపించారు. వీటిపై దర్శకుడు మణిరత్నం స్పందన ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.